రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో జర్నలిస్టుగా పని చేసిన ప్రసాద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. శనివారం అకాల మరణం అందరిని కలిచివేసింది. అంతిమ యాత్రకు బంధు మిత్రులు అధిక సంఖ్యలో తరలివచ్చిన చివరి చూపును చూసి అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు వేదన అంతఇంత కాదనే చెప్పాలి.