రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

65చూసినవారు
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
భూ భారతి కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. భూ భారతి కింద రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రుద్రంగి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయగా, ఆయా గ్రామాల్లో సదస్సులు కొనసాగుతున్నాయి. రుద్రంగి మండల పరిధిలోని దెగావత్ తండాలో రెవెన్యూ సదస్సులు చేపట్టగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్