రహదారి విస్తరణ పనులతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యంత్రాల సాయంతో మట్టిని తొలగించి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. మట్టి కుంగటంతో ఆర్టీసీ బస్సు అందులో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బస్సు బయటకు రాలేదు. చివరకు జేసీబీ సాయంతో బయటకు తీశారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.