సిరిసిల్ల: పింఛన్ ఇస్తానని వృద్ధురాలి నగలు, నగదు చోరీ

80చూసినవారు
గంగాధర బస్టాండ్ లో ఓ వృద్ధురాలిని మోసం చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వేములవాడ మండలం నమిలిగుండుపల్లికి చెందిన గోళి వజ్రమ్మ (80) తన కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి “నేడు మీకు పింఛన్ ఇస్తా” అంటూ మాయమాటలు చెప్పాడు. కార్యదర్శినని చెప్పుకుంటూ ఆమె చెవికమ్మలు, బంగారం, నగదు తీసుకొని పరారయ్యాడు. ఎస్ఐ వంశీకృష్ణకేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్