దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానమునకు విచ్చేసి స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారని, ప్రస్తుతం ఉన్న విస్తీర్ణంతో భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందజేయలేకపోతున్నామని, ఆ మేరకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే చర్యలు ప్రభుత్వం ద్వారా కొనసాగుతున్నట్లు దేవస్థానం ఓపెన్ స్లాబ్ నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆలయ అధికారులు ఈవో వినోద్, అర్చక బృందం తెలిపారు.