వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ లో గల కమాన్, వీకే కంప్యూటర్స్ ఎదురుగా, బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు అద్వానంగా మారి దర్శనమిస్తోంది. ఆదివారం రాత్రి కురుస్తున్న వర్షానికి గుంతల రోడ్లలో వర్షపు నీరు నిలిచి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగితే కానీ సంబంధిత అధికారులు స్పందించరా అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరంటూ మండిపడుతున్నారు.