
ఉరేసుకొని యువతి ఆత్మహత్య
TG: నల్గొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరి వేసుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. మాన్య చెల్కకు చెందిన మాధురి (26) బిటెక్ పూర్తి చేసి ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.