వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ఉదయమే అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకొని సేవలో తరించారు.