దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శనివారం సంక్రాంతి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలు తరలించారు. దీంతో ఆలయం సందడిగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు స్వామివారి ఇష్టమైన కోడె మొక్కులలో పాటు ఇతర మొక్కలు చెల్లించుకున్నారు.