వేములవాడ: ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు

3చూసినవారు
వేములవాడ: ఓటరు జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు
వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేరును ఎన్నికల ఓటరు జాబితాలో నుంచి తొలగించారు. సంబంధిత నోటీసును శనివారం ఆర్డీవో కార్యాలయ సిబ్బంది రమేశ్‌బాబు ఇంటి గోడకు అతికించారు. రమేశ్‌బాబు భారత పౌరుడు కాదని, జర్మనీ పౌరుడేనని హైకోర్టు తీర్పునిచ్చింది. ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు పేరు తొలగించినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్