పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ప్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని సొసైటీ గోదాం ఆవరణలో డిసిఓ రామకృష్ణ, సూపరింటెండెంట్ రమతో కలసి మొక్కలు నాటారు. అందరూ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.