రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలను పరిసర ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ డిఈ మైపాల్ రెడ్డి ఏఈ రామకృష్ణ, ఏఈఓ అశోక్ లతో కలిసి మంగళవారం పరిశీలించారు. వేములవాడ రాజన్నఆలయ వసతి గృహాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం. అనే కథనాన్ని లోకల్ యాప్ ప్రచురించింది. అధికారులు స్పందించి పరిశీలించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.