వేములవాడ మటన్ మార్కెట్ ప్రాంతానికి చెందిన డీటి వేణుగోపాల్, రాణి దంపతుల కుమారుడు రోహిత్ (24) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడడంతో పట్టణంలో విషాదం నెలకొంది. బీటెక్ చదువుతున్న రోహిత్ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన రాసిన సూసైడ్ నోట్ హృదయాలను కదిలిస్తుంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.