వేములవాడ పట్టణంలో ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే గుడి ప్రాంతాల్లో భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఉదయం నుంచి ఆకాశం మేఘవృతమై దర్శనమిస్తోంది. రెండు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.