VIDEO: మత్తడి దుంకుతున్న విలాసాగర్ చెరువు

62చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాకతీయుల కాలంనాటి అతిపెద్ద పురాతనమైన బోయినిపల్లి(M) విలాసాగర్ గ్రామంలోని చెరువు అలుగుపారుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఎగువ కురిసిన వర్షాలతో కోరెం, నల్లగొండ గ్రామాల నుంచి అన్ని చెరువులు, కుంటలు మత్తడి పడడంతో వాటి నీరు చెరువులోకి చేరడంతో పాటు, కట్ట కాలువ నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల చెరువు నిండుకుండలా మారింది. దీంతో గ్రామస్థులు, రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్