ఓల్టేజ్ సమస్యలు లేకుండా చూస్తాం : కార్పొరేటర్ నర్మద నర్సన్న

72చూసినవారు
కరీంనగర్ 11 డివిజన్ లో వోల్టేజ్ సమస్యల లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కార్పోరేటర్ ఆకుల నర్మద- నర్సన్న అన్నారు. ఇందుకోసం కొత్తగా 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ కట్టారాంపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పోరేటర్ నర్మద- నర్సన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కరీంనగర్ రోజు రోజుకు విస్తరిస్తుందని ఇందులో భాగంగా కట్టారాంపూర్ లో సైతం ఇళ్ళ నిర్మాణాలు పెరుగుతున్నాయన్నారు. అయితే కొత్తగా నిర్మాణమవుతున్న ఇండ్లతో ఇప్పుడు ఉన్న విద్యుత్ వినియోగదారులు లో ఓల్టేజీ సమస్యలతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మూడు 100 కేవీ ట్రాన్స్ ఫార్మార్లను మంజూరు చేశారన్నారు. మంజూరైన ట్రాన్స్ఫార్మర్ లను ఒకటి విద్యార్థి స్కూల్, రెండవది తులసి నగర్ గల్లిలో ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం హయాంలో 11 వ డివిజన్ లో మంజూరై ఆగిపోయిన రోడ్లు డ్రైనేజీ పనుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొని వెళ్లగా త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్