మాల్దీవుల పర్యాటక ప్రోత్సాహక సంస్థ మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC) బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను ప్రపంచ పర్యాటక రాయబారిగా నియమించింది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో గౌరవంగా ఉందని కత్రినా తెలిపారు. మాల్దీవులు తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశమని పేర్కొంటూ, ఈ పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా మాల్దీవుల పర్యాటక సంపదను పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు.