మాల్దీవ్స్.. తమ గ్లోబల్ టూరిజం అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖురాలైన కత్రినా.. తమ దేశానికి అంబాసిడర్‌గా ఉండటం సంతోషకరమని తెలిపింది. కాగా వచ్చే నెలలో ప్రధాని మోదీ మాల్దీవ్స్ ప్రర్యటనకు వెళ్లనున్నారు.