HYDలో నిర్వహించనున్న ఆషాఢమాసం ప్రతి బోనంపై జై తెలంగాణ అని రాయాలని BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మన తెలంగాణ అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. ఫోన్ ఎత్తినప్పుడు హలో అని కాకుండా జై తెలంగాణ అనాలి అని సూచించారు. పెంచిన బస్సు రేట్లపై తెలంగాణ జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుందని వెల్లడించారు. ఉచిత బస్సు పథకం పెట్టమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము అడిగామా? అని ప్రశ్నించారు.