TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లులు కవితే అంగీకరించడం లేదని మంత్రి సీతక్క విమర్శించారు. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే చచ్చిపోయిందని మంత్రి వెల్లడించారు. కేటీఆర్ తమ నాయకుడే కాదని కవిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సీతక్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 40 గంటల్లోనే ఉచిత బస్సు ఇచ్చామని సీతక్క చెప్పారు. ఇంటికే పరిమితమనే దశ నుంచి మహిళలు ఉద్యోగాల్లోకి వచ్చారని సీతక్క తెలిపారు.