BRS MLC కవిత కాంచన్ బాగ్ PS నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె మాట్లాడారు. ధరలు పెంచడం కాదు.. ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 'గతంలో కేసీఆర్ ఇచ్చినట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి. ధరలు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతారు. మహిళలకు ఫ్రీ బస్ వల్ల మగవాళ్లు టికెట్ కొన్నా కూర్చునే అవకాశం ఉండటం లేదు. టికెట్ రేట్లు పెంచుతున్నారు తప్ప బస్సులు పెంచడం లేదు' అని ఫైర్ అయ్యారు.