TG: యువతకు, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. రాజకీయ నేపథ్యం లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదికగా.. లీడర్స్ మేకర్‌గా జాగృతి పనిచేస్తుందన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'లీడర్' పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్ ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు.