నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యాంను BRS MLC కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యామ్, కేసీఆర్ తెలంగాణను పచ్చబడేయడానికి తపన. మంజీరా నదిపై ఇలాంటి 4 చెక్ డ్యాంలు నిర్మించి రైతులు పంటలు పండించుకునేలా కేసీఆర్ చేశారు. ఈ ఒక్క చెక్ డ్యామ్‌పై ఆధారపడి 1,600 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి' అని చెప్పారు.