TG: బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్‌తో పాటు 9 మంది BRS నేతలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్‌రావు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను ప్రశ్నించనున్నారు.