కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సాధారణ విషయం కాదని.. మరో దేశంలో ఇలా జరిగి ఉంటే కేసీఆర్‌కు సమున్నత పురస్కారాలు వచ్చేవని కేటీఆర్ అన్నారు. 'BJP, INC ప్రభుత్వాలు ఇంతటి ప్రాజెక్టును రికార్డు సమయంలో కట్టినందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భాక్రా నంగల్, నాగార్జున సాగర్, నర్మద, SRSP ప్రాజెక్టులు నిర్మించడానికి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్నాయి.. కానీ కేసీఆర్ నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తిచేశారు' అని చెప్పారు.