తెలంగాణలో కరోనా కష్టసమయంలో కూడా కేసీఆర్ రైతుబంధు ఆపలేదని BRS నేత హరీశ్ రావు గుర్తు చేశారు. రేవంత్ సర్కార్.. పంట బీమాకు సంబంధించి బడ్జెట్లో డబ్బులు పెట్టి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 'వానాకాలం రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగికి సగం మందికి వేసామన్నారు. ఆ సగం మందికి కూడా పూర్తిగా రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు, రైతుబంధు పడలేదనే బాధలో ఉన్నారు. వడగండ్ల వానతో రైతులు ఆందోళనలో ఉన్నారు' అని వివరించారు.