కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల సంతాపం ప్రకటించిన కేసీఆర్

80చూసినవారు
కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల సంతాపం ప్రకటించిన కేసీఆర్
యూపీలోని ప్రయాగరాజ్ మహాకుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో మరణించడం బాధాకరమని కేసీఆర్ పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం సరియైన ఏర్పాట్లు కల్పించి, తగు రక్షణ చర్యలు చేపట్టాలని యూపీ ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్