కేసీఆర్ రైతు బందువు అని.. రేవంత్ రెడ్డి రాబందు అని మాజీ మంత్రి KTR వ్యాఖ్యానించారు. 'రైతు రుణమాఫీ, రైతు బంధుకు కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. ఉమ్మడి ఏపీలో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం పదవిలో కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇచ్చింది BRS కాదా? కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.