చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌: కేటీఆర్‌

70చూసినవారు
చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌: కేటీఆర్‌
తెలంగాణలో చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్‌ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నల్గొండకు కేసీఆర్‌ ఏం చేశారని అసెంబ్లీలో మంత్రి నిలదీశారని, వరి విషయంలో తెలంగాణను దేశంలో నంబర్‌వన్‌గా కేసీఆర్ నిలిపారని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎన్‌ఎస్‌పీ కింద టెయిల్‌ ఎండ్‌ గ్రామాలకు నీళ్లు వచ్చేవి కాదని, కృష్ణా, గోదావరిలో నీళ్లు ఒడిసిపట్టి పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం చేపట్టామని వ్యాఖ్యానించారు.