TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. 11.30 గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా అక్కడికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.