TG: నిజమాబాద్ బాన్సువాడలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నట్లు తెలిసిందని, రజతోత్సవ సభకు వెళ్లొందంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. వారి పేర్లను పింక్ బుక్‌లో రాస్తున్నామని, బీఆర్‌ఎస్ వచ్చాక అందరిపని చెబుతామని హెచ్చరించారు. కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ తాను మాత్రం రౌడి టైప్ అని, ఎవరిని వదిలిపెట్టనన్నారు.