ఈనెల 11న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంన్న నేఫథ్యంలో రైతుల సమస్యలు, కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కష్టాలు, రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ నిరసనలు, రోడ్ షోలు చేపట్టనున్నట్లు సమాచారం.