కాంగ్రెస్‌లోకి కేసీఆర్‌ కుటుంబానికి ఎంట్రీ లేదు: సీఎం రేవంత్

77చూసినవారు
కాంగ్రెస్‌లోకి కేసీఆర్‌ కుటుంబానికి ఎంట్రీ లేదు: సీఎం రేవంత్
TG: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోకి కేసీఆర్‌ కుటుంబానికి ఎంట్రీ లేదని వెల్లడించారు. తెలంగాణకు కేసీఆర్‌ కుటుంబమే అతి పెద్ద శత్రువని, రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కర్ణాటకలో కులగణనకు సంబంధించి మాత్రమే చర్చ జరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం గురించి రెండు రోజుల్లో ప్రెస్‌ మీట్‌ పెడతానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్