తెలంగాణ మాజీ సీఎం KCR అధ్యక్షతన ఈనెల 19న BRS విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ భవన్‌లో మ.1 గంటకు పార్టీ నేతలు భేటీ కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై కేసీఆర్ విస్తృత స్థాయిలో చర్చించనున్నారు.