TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థత కారణంగా గురువారం యశోద ఆసుపత్రిలో చేరగా వైద్యుల సలహా మేరకు ఆయన శనివారం డిశ్చార్జీ అయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు నిర్థారించారు. కాగా వైద్య పరీక్షల్లో భాగంగా ఒక వారం తర్వాత, మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రానున్న గురు, శుక్ర వారాల్లో మరోసారి యశోద ఆస్పత్రికి వెల్లనున్నారు.