త్యాగాలతో తెలంగాణ కోసం KCR మొదటి అడుగు వేశారని BRS MLC కవిత అన్నారు. కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా వదిలేశారని చెప్పారు. 'రాష్ట్రం ఏర్పడితే కటిక చీకటి వస్తుందని అప్పటి CM కిరణ్ కుమార్ అన్నారు. కానీ రాష్ట్రం వచ్చాకా వెలుగు జిలుగుల తెలంగాణను తయారు చేసుకున్నాం. సాగునీళ్ల పన్ను మాఫీ చేసిన వ్యక్తి KCR. రైతుబంధు, రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలను KCR చేపట్టారు. చివరి గింజ వరకు వడ్లు కొన్నాం' అని వ్యాఖ్యానించారు.