HYD-యశోద ఆసుపత్రిలో స్వల్ప అనారోగ్యంతో అడ్మిట్ అయిన BRS చీఫ్ కేసీఆర్, వైద్యుల సలహామేరకు ఈరోజు డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే వైద్య పరీక్షల్లో భాగంగా, ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని, ఆ తర్వాత మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వుంటుందని యశోద వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న గురు, శుక్రవారాల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద హాస్పటల్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు.