కీర్తి కన్నీటి వ్యథ.. తల్లిదండ్రులే కాదనుకున్నారు!

61చూసినవారు
కీర్తి కన్నీటి వ్యథ.. తల్లిదండ్రులే కాదనుకున్నారు!
AP: అనంతపురం నగరంలోని పాతూరు మున్నానగర్‌కు చెందిన వెంకటలక్ష్మి, బ్రహ్మయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. బ్రహ్మయ్య మృతితో వెంకటలక్ష్మిని పిల్లలు వదిలేశారు. ఆమె ఒంటరిగా ఉంటూ రెడీమేడ్ సామన్లు అమ్ముతుంటారు. అయితే వెంకటలక్ష్మి చిన్నకొడుకుకి రెండోసారి కూతురు పుట్టడంతో ఆ చిన్నారిని అమ్మేయాలనుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న వెంకటలక్ష్మి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకున్నారు. కీర్తి అని పేరు పెట్టారు. తన తర్వాత చిన్నారిని ఎవరు చూస్తారని ఆవేదన పడుతున్నారు. పాపను ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్