ఓడిపోతారని తెలిసే కేజ్రీవాల్‌ చిల్లర రాజకీయాలు: అమిత్ షా

75చూసినవారు
వచ్చే నెల 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ యమునా నదిలో BJP విషం కలిపిందని ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఇవాళ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఆప్‌ పాలనలో యమునా నది కలుషితమైపోయిందని.. ఢిల్లీ ప్రజలతో మురికి నీటిని తాగిస్తోందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కేజ్రీవాల్‌ గ్రహించారని.. అందుకే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్