యమునా నది కాలుష్యంపై ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకు కలుషితమైన యమునా నదిలోని నీటిని ప్రజలను తాగనివ్వనని అన్నారు. ‘యమునా నది అంశంపై ఎన్నికల సంఘం నాకు పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష సరిగా లేదు. ఈ అంశంపై నోటీసులు పంపి ఈసీ రాజకీయం చేయడం తగదు. నేను జీవించి ఉన్నంతకాలం ఢిల్లీ ప్రజలను కలుషితమైన నీటిని తాగనివ్వను’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.