కేజ్రీవాల్ ఢిల్లీకి నాలుగోసారి సీఎం అవుతారని ప్రస్తుత సీఎం ఆతిశీ జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది మామూలు ఎన్నిక కాదని, మంచి, చెడు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. ఢిల్లీ ప్రజలు తమ పార్టీతోనే ఉంటారని తనకు విశ్వాసం ఉందన్నారు. కాగా అధిక స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.