మావోయిస్టు పార్టీలో నంబాల కేశవరావు అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన తూర్పు గోదావరి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో పనిచేశారు. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ అధిపతిగా కీలక పాత్ర పోషించారు. 2018లో మావోయిస్టు నేత గణపతి రాజీనామా తర్వాత కేశవరావు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత పార్టీ సైనిక, వ్యూహాత్మక కార్యకలాపాలను ముందుండి నడిపించారు.