ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేటకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1958లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. కేశవరావు వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్‌ఈసీ)లో ఇంజనీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చేస్తుండగా పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో ఆయన జీవితం మావోయిస్టు ఉద్యమం వైపు మలుపు తిరిగింది.