'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన

80చూసినవారు
'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
AP: కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే 'తల్లికి వందనం' పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం అమలుపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం మే నుంచి అమలు కాబోతుందని తెలిపారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయాన.. రాష్ట్రంలో విద్యా శాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దీని ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 అందనున్నాయి.

సంబంధిత పోస్ట్