ఫీజులపై ప్రైవేటు స్కూళ్లకు కీలక ఆదేశాలు

68చూసినవారు
ఫీజులపై ప్రైవేటు స్కూళ్లకు కీలక ఆదేశాలు
ప్రైవేటు పాఠశాలలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఓ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు అందాయి. దీంతో కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. 2018–19 నుంచి 2024–25 మధ్య కాలంలో రూ.64.58 కోట్లమేర ఫీజులను అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది. దీన్ని తప్పుపడుతూ.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్