TG: ‘‘స్పై’’ సినిమాను ఎంత బడ్జెట్‌లో నిర్మించారు. దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? తదితర విషయాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది. కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించింది. ఇంకా ఏయే సినిమాలు నిర్మాణానికి సిద్ధమయ్యారు? వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు కూడా చూపించారు. అలాగే ఇందుకు మనీ రూటింగ్ ఎలా చేశారు? అనే దానిపై సిట్ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి.