హైడ్రాకు రక్షణగా ఉన్న ఆర్డిరెన్స్‌లో ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణ తొలిగింపు అధికారం కల్పించే జీహెచ్‌ఎంసీ చట్టం-1955 లోని సెక్షన్ 374బీని చేర్చారు. అలాగే హెచ్‌ఎండీఏ చట్టం-2008 లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారం, భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317 ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలిగింపు, జీవో 67 ద్వారా 2002లో యూడీఏ /ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు.