AP: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వంశీబాబు, గంటా వీర్రాజును అనే ఇద్దరు వ్యక్తులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును సీజ్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. విజయవాడ సబ్ జైలులో వంశీ, ఎలినేని రామకృష్ణ, లక్ష్మీపతి, వంశీబాబు, గంటా వీర్రాజు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.