TG: పాఠశాల సిబ్బంది మందలించారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలోని కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని బయట తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుండడంతో పాఠశాల సిబ్బంది మందలించారు. తనను ఇంటికి పంపిస్తారేమో అని భయంతో, తీవ్ర మనస్తాపానికి గురై యాసిడ్ తాగినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది.