ఇజ్రాయెల్‌తో సీజ్‌ఫైర్ ఒప్పందం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తొలిసారి బహిరంగంగా కనిపించారు. మొహర్రంలో భాగంగా 'అషూర' కార్యక్రమానికి టెహ్రాన్‌లో హాజరయ్యారు. గత నెల ఇజ్రాయెల్ మిస్సైల్ దాడుల్లో పలువురు ఇరాన్ నేతలు హతమవడంతో ఖమేనీ హత్యాయత్నం జరిగే ప్రమాదం ఉందనే భయంతో బంకర్‌లో తలదాచుకున్నారు. సీజ్‌ఫైర్ అనంతరం మళ్లీ ప్రజల్లోకి వచ్చారు.